తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక దారపనేని చంద్రశేఖర్
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, సంక్రాంతి సకల శుభాలు అందించాలని, భోగిమంటలతో ప్రతి కుటుంబంలో భోగభాగ్యాలు వెల్లి విరియాలని, సరదాల సంక్రాంతిని సరదాగా జరుపుకోవాలని కమ్మని కనుముతో ప్రతి కుటుంబము సంతోషభరితంగా వర్ధిల్లాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాన ముంగిళ్ళ ముగ్గులతో, హరిదాసు గానాల తో, వాకిళ్ళ ముందర గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి పండుగను నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని దారపనేని ఆకాంక్షించారు.