
ఆటగాళ్లపై నిబంధనలు విధించిన బీసీసీఐ
ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా బీసీసీఐ ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంటతీసుకొచ్చే విషయంలో కోచ్, సెలక్టర్ల
ఆమోదం ఉండాలని తెలిపింది. లగేజీ పరిమిత
బరువు ఉండాలని పేర్కొంది.వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని, ముందుగానే ప్రాక్టీస్ సెషన్లు వీడొద్దని ప్లేయర్లకు స్పష్టం చేసింది.
