Current bills should be given within a month. Additional burden in the name of ACDs
నెలలోపే కరెంట్ బిల్లులు ఇవ్వాలి. ఏసీడీల పేరుతో అదనపు భారం ప్రజలపై మోపొద్దు.
సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
నెలలోపే ఇండ్లకు కరెంటు బిల్లులు ఇవ్వాలని ఏసీడీల పేరుతో ప్రజలపై అదనపు భారం మోపొద్దు అని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఖమ్మం 3 టౌన్ సెంటర్ కోర్ కమిటీ సమావేశం షేక్ హిమాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరెంటు బిల్లులు ప్రతినెల ఇండ్లకు ఇచ్చే బిల్లులు నెలలోపే ఇవ్వాలని నెల దాటిన తర్వాత ఇస్తే అదనపు యూనిట్లు పెరిగి ప్రజలపై భారాలు పడుతున్నాయి ఎక్కువ బిల్లులు వస్తున్నాయి దీనివలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.
అంతేకాకుండా ఏసీడీల పేరుతోటి బిల్లు లో ఎక్కువ బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు. నెలవారి బిల్లులలో అదనపు సర్ చార్జీల పేరుతో బిల్లుల్లో వసూలు చేయడం సరైనది కాదు ప్రభుత్వ నష్టాల్లో ఉన్నదని పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడం సరైనది కాదు.
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ సంస్థలే 20వేల కోట్లు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు ప్రజలపై వేసి వసూలు చేయడం అనేది సరైనది కాదు కరెంటు బిల్లులో ఏసీడీల పేరుతోటి ఒక్కొక్క బిల్లులో 3000 రూపాయలు, 4000 రూపాయలు అదనంగా వస్తున్నాయి అసలే నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి ప్రజల నానా ఇబ్బందులు
పడుతుంటే మరల కరెంటు బిల్లులలో ఎక్కువ వసూలు చేయడం కరెక్ట్ కాదు వెంటనే అదనపు చార్జీలు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం 3 టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు ప్రతిపాక నాగ సులోచన, శీలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.