SAKSHITHA NEWS

రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి పాలన
సి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం అవర్ స్టేట్ అవర్ లీడర్ లో భాగంగా సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డా. బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు.వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆరాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు.పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే నేడు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని గుర్తుచేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారన్నారు.విద్య, వైద్యానికి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రొఫసర్స్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS