రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనమే వర్గీకరణ చేసుకోవచ్చు.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్.

Spread the love

గత 3 రోజులుగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ మునిసిపల్ చౌరస్తా అంబెడ్కర్ విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని నేడు సందర్శించి సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా వర్గీకరణ పోరాటం నడుస్తుందని ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపి గద్దెనెక్కిన తరువాత పట్టించుకోవడం మానేస్తున్నాయని, ఈ అంశన్నీ ఎన్నికల అంశంగా మాత్రమే ఓట్ల కోసం మాత్రమే చూస్తున్నాయని ఎద్దేవాచేశారు.

సీపీఐ మాత్రం ఎన్నికల అజెండా గా కాకుండా సామాజిక కోణంలో చూస్తూ మొదటి నుండి ఉద్యమానికి మద్దతు తెలియచేస్తూదని అన్నారు. కావున ఎన్నికల అజెండాగా కాకుండా ప్రజల అజెండాగా మార్చి రాజ్యాధికారం కోసం పోరాటం నిర్వహిస్తే వర్గీకరణ సాదించుకోవచ్చు అన్నారు.
మన హక్కులు, లక్ష్యాలు సాదించలంటే లాల్ నిల్ ఐక్యం కావాలని కోరారు.
రానున్న రోజుల్లో కూడా తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇమామ్,ప్రభాకర్, సంతోష్,ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page