SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 13 at 15.48.26

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నేడు షాపుర్ నగర్ లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాఫ్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారతదేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం రాజకర్లు, దేశముఖ్ ల ఆగడలతో ప్రజలు హింసకు గురవుతుంటే నాటి భారత ప్రభుత్వం పట్టించుకోకపోవడం చేత ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావినారాయన రెడ్డి,బద్దం ఎల్లారెడ్డి, మక్డుం మోహినుద్దీన్ లు సాయుడిపోరాటానికి పిలుపునిచ్చి ప్రజలను పోరాటాల వైపు నడిపించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాజకర్లను, దేశముఖ్లను పల్లెల నుండి టారుమికొట్టితే నాటి దొరలు,దేశముఖులు కమ్యూనిస్టు దళాలను తట్టుకోలేమని,వారిని అదుపులో పెట్టకపోతే తమ ఆస్తులు, పెత్తనం పోతుందని కమ్యూనిస్టులు అప్పటికే 10 లక్షల ఎకరాల భూములను భూమి లేనివారందరికి పంచడం వల్ల కమ్యూనిస్టుల ప్రభావం దేశం మొత్తం చూపిస్తోందనే భయాన్ని నాటి ప్రధానికి వర్తమానం పంపితే కమ్యూనిస్టులను ఎదుర్కివడానికే పటేల్ సైన్యం హైదరాబాద్ సంస్థానం వైపు వచ్చి కమ్యూనిస్టులనే చంపాయి కానీ రాజకర్లను కాదని ఇది అసలు చరిత్రనని అన్నారు.

ఒకవేళ పటేల్ సైన్యం నిజాం ను గద్దెదించడానికి వస్తే ఆ నిజాం నే హైదరాబాద్ బాగ్ ప్రముఖ్ గా పదవినిచ్చి 2 లక్షల సంవత్సర పారితోషకం ఎందుకీచారని ప్రశ్నించారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వారిని 1951 వరకు ఎందుకు జైల్లోనే ఉంచి ఉరిశిక్షను విధించారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు వాస్తవ చరిత్ర చెప్పకుండా ఇది హిందు ముస్లిం గోడవగా,పటేల్ వల్లే తెలంగాణ విలీనం అయ్యిందని తన సహజగుణం అయ్యిన అబద్దాని ప్రచారం చేస్తుందని,నాజీ హిట్లర్ కాలంలో గ్లోబెల్ అనే వాడు అబద్దాలు ప్రచారం చేసినట్టు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ లో ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు భూమి దక్కిందంటే అది కేవలం కమ్యూనిస్టు పోరాటం వల్లే కానీ ఏ ప్రభుత్వాలు కూడా కమ్యూనిస్టులు పంచినంత భూమి పంచలేదని అన్నారు.బీజేపీ,బి ఆర్ ఎస్ రెండు ఒకటిగా ఉంటూ ప్రజలకు హామీల పేరుతో మోసం అబద్దాలను అమలుకాని హామీలను ఇస్తున్నామని కావున ప్రజలు నిజమైన చరిత్రను తెలుసుకొని అసలు ప్రజల కోసం ఎలాంటి మందు,డబ్బులు పంచకుండా,మతం,కులం ,ప్రాంతం పేరుతో కాకుండా ప్రజాలకోసమే పోరాటం చేసే వారు ఎవరో తెలుసుకోవాలని అన్నారు.


ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి,సి ఐ టు యి నాయకులు దేవదానం నాయకత్వం వహించగా ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ ,సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాము,డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్,సీపీఎం నాయకుడు సత్యం,మహిళా నాయకురాలు స్వాతి,సీపీఐ, సీపీఎం నాయకులు మహేందర్, చంద్రకాంత్, రాములు, చంద్రమౌళి,మహేందర్, ప్రకాశ్, భీమేశ్, జార్జ్,అశోక్ రెడ్డి లతో పాటు వందలాదిగా పాల్గొన్నారు


SAKSHITHA NEWS