బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్

Spread the love

బిఆర్ఎస్ పాలనలో యువత భవిత ఆగమాయే-ఎంపీపీ వైయస్సార్

లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

కొలువులు భర్తీ చేయమంటే ఉన్న ఉద్యోగాలు ఊడబీకిండు

రాష్ట్ర యువత కొలువులకు నోచుకోక అలమటిస్తున్నారు

కెసిఆర్ ప్రభుత్వం యువతను గంజాయికి,మద్యానికి బానిసలను చేస్తోంది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి సారధ్యంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ దగ్గర 24 గంటలు నిరాహార ఉపవాస దీక్ష కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు మద్దతుగా 24 గంటల ఉపవాస దీక్షలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్ని రకాలుగా వారిని మోసం చేసిందని యువతను గంజాయికి,మద్యానికి బానిసలను చేస్తోందని నిరుద్యోగ భృతి హామీకే పరిమితమైందని, తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా దాని ఊసేలేదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలు ఊడబీకిండు 40 లక్షల మంది యువత కొలువులకు నోచుకోలేక అలమటిస్తున్నారని వారికి బిజెపి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మీడియా ద్వారా తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page