కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

Spread the love

మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యల పై షాపుర్ నగర్లో సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం తో పత్రిక ప్రకటన.

సిద్దిపేట జిల్లాలో అంగన్ వాడి ఉద్యోగుల తో హరీష్ రావ్ కమ్యూనిస్టులను చులకన చేసిమాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదని,కమ్యూనిస్టుల గురించి సరిగ్గా తెలిసినవారు ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయరని అన్నారు.
రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్లే కమ్యూనిస్టుల పై నిందలు వేస్తారని అందులో హరీష్ రావ్ కూడా చేరడం బాగులేదని అన్నారు. స్వతంత్రోద్యమంలో పాల్గొని నిర్బందాలు ఎదుర్కొని ఎందరో ప్రాణాలు ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు.
టి ఆర్ ఎస్ నాయకులు పుట్టకముందే కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని,టి ఆర్ ఎస్ పుట్టకముందే కమ్యూనిస్టులు తెలంగాణ కోసం వరంగల్ డిక్లరేషన్ చేసిందని అప్పుడు మామా,అల్లున్లు తెలంగాణ కోసం మాట్లాడని పార్టీలో ఉన్నారని నేడు వారేదో పెద్ద ఉద్యమకారులుగా చెలామణి అవుతున్న ఆ ఉద్యమ స్ఫూర్తి,చైతన్యం ఈ తెలంగాణ గడ్డ మీద కల్పించిన స్ఫూర్తి కమ్యూనిస్టులకు ఉందని అన్నారు. అవసరం కోసం ఇతర పార్టీలకు వెళ్లడం,లేక ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే పార్టీ కమ్యూనిస్టు పార్టీ కాదని అన్నారు. మా దగ్గర కార్యకర్తలు లేరనుకుంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ సీపీఐ పార్టీ కార్యాలయానికి వచ్చాడు కానీ సీపీఐ నాయకుల రాలేదని,అలాగే రాజ్యసభ సభ్యుడిఎన్నికల సమయంలో, హుజర్నగర్,మునుగోడు ఎన్నికల్లో టి ఆర్ ఎస్ నాయకులు ఎందుకు కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చారని అప్పుడు లేని మాటలు ఇప్పుడు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామని మాట్లాడితే,ఆ అధికారం శాశ్వతం కాదని కానీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం అజరామరం అని,సూర్యుడి పై ఉమ్ము వేయాలని అనుకుంటే అది తిరిగి తమ మీదే పడుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు స్వామి,మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య,రాము ప్రజానాట్యమండలి కార్యదర్శి ప్రవీణ్,దళిత హక్కుల సంఘం నాయకులు రాములు, నర్సయ్య, ఏ ఐ వై ఎఫ్ కార్యదర్శి వెంకటేష్, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page