సాయి నగర్ వెస్ట్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో 15 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సాయి నగర్ వెస్ట్ ఎర్ర పోచమ్మ దేవాలయం వద్ద రోడ్డు నెంబర్ 6లో ఇటీవలే డ్రైనేజీ పనులు పూర్తవడంతో వెంటనే సీసీ రోడ్డు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంబించడం జరిగింది అన్నారు.

నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, నాగేశ్వరరావు, సుబ్బారావు, వెంకటేశ్వర రావు, శ్రీధర్, రఘు, సంతోష్ బిరాదర్, ఉమేష్, టి.ప్రవీణ్, శ్రీనివాస్, నరసింహిలు, హరి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page