కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న పనులను జిహెచ్ఎంసి, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ జై భారత్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో జిహెచ్ఎంసి, ఎలక్ట్రికల్ మరియు హార్టికల్చర్ అధికారులతో సమన్వయం చేసుకొని చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది అని, అలాగే పలు కాలనీలలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన చోట్ల వెంటనే మరమ్మత్తులు చేసి సరఫరాను పునర్దించాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అంతరాయం ఉన్న చోట అధికారులు కూడా సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు సహకరించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ కాళీ, హార్టికల్చర్ సూపర్వైజర్ దాసు, రాంకీ సూపర్వైజర్ శశి,ఎస్ఎఫ్ఏ భరత్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.