Construction of Jagananna House should be expedited – Commissioner Anupama Anjali
జగనన్న ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలి – కమిషనర్ అనుపమ అంజలి.
*
సాక్షితతిరుపతి : * జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులపై దృష్టి సారించి వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. చంద్రగిరి మండలం కొత్తపల్లి లే అవుట్ లోని నిర్మాణాలను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలిస్తూ ఆలస్యం కాకుండా సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి అర్భన్ నివాసితులకు చంద్రగిరి మండలం కొత్తపల్లిలో కేటాయించిన ఆరు వేల ఇంటి స్థలాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
కొన్ని నిర్మాణాలు బేస్ మెంట్ పూర్తి చేసుకోవడం, మరికొన్ని గోడలు పూర్తి చేసుకోవడం, మిగిలినవి స్లాబ్ లెవల్లో పనులు పూర్తి అయినట్లు వివరించారు. లే అవుట్లో ఇంటి నిర్మాణ పనుల్లో ఇబ్బంది రాకుండ ఇన్నర్ రోడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్ కొరత లేకుండా హౌసింగ్ అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు కమిషనర్ అనుపమ తెలిపారు. సిమెంట్ భద్రపరుచుకునేందుకు అవసరమైతే మరిన్ని గౌడవున్లు నిర్మించుకోవాలన్నారు.
లే అవుట్లలో విధ్యుత్ ధీపాలు మరిన్ని ఏర్పాటు చేసుకోవాలని, నీరు కొరకు అవసరమైతే మరిన్ని బోర్లు వేసుకోవాలని సూచనలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, హౌసింగ్ డిఈ మోహనరావు, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు.*