SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో రూ. 1 కోటి 51 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో చేపట్టబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే CDP SDP నిధులతో రూ. 1 ఒక కోటి 51 యాబై ఒక లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా నిర్మించబోయే అదనపుతరగతి గదుల నిర్మాణ పనులకు ఈ రోజు శంకు స్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ విద్యారంగానికి ఎనలేని కృషి చేస్తున్నారు అని , కేజీ నుండి పీజీ వరకు ప్రవేశపెట్టడం, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ కె దక్కుతుంది అని ,” మన ఊరు.. మన బడి ” కార్యక్రమం ద్వారా రూ.7,300 కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కలిపించడానికి శ్రీకారం చుట్టారని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టడం జరిగినది అని, ప్రయివేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ కు ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగినది అని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని ,మెరుగైన మౌలిక వసతులు కలిపిస్తామని, పిల్లలకు చదువుకోవడానికి వీలుగా అనువైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని , నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, భవనం నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు పిల్లల చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, అదనపు తరగతి గదుల నిర్మాణము పై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS