జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి

Spread the love

జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి (POC) దేవర మనోహర , రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి మరియు ఇతర నాయకులు.

తెనాలి కాబోయే ఎమ్మేల్యే, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) చైర్మన్, పూజ్యులు నాదెండ్ల మనోహర ని కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు గురించి అలాగే వైసిపి చేస్తున్న దౌర్జన్యాల గురించి కూలంకుషంగా వివరించండం జరిగింది, సుదీర్ఘంగా చర్చించిన తరువాత నాదెండ్ల మనోహర చాలా సానుకూలంగా స్పందించి ఎన్నికల నేపథ్యంలో అడ్డంకులు వస్తాయి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీకు ఇచ్చిన బాధ్యతలతో మరింత సమిష్టిగా కృషి చేయండి అని తెలిపి మీకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పడం జరిగింది.

రానున్న రెండు నెలలు ఇంకా కీలకంగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి అయిన పులవర్తి నాని ని టిడిపి – బిజేపి కూటమి సారథ్యంలో, అత్యంత మెజారిటీతో గెలిపించి బహుమతిగా ఇస్తామని చెప్పి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page