రానున్నఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం లోను ముచ్చటగా మూడవసారి గులాబీ జండా ఎగురవేసి చరిత్ర సృష్టించబోతున్నం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 – రంగారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ నాయకులు మహమ్మద్ సిరాజ్ వారి అనుచరులు ఎం.డి. గౌసుద్దిన్, జలీల్, శౌరీరాజ్, కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు ఎమ్మెల్యే కే.పి వివేకానంద్ మరియు స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి విషయంలోనూ ఇటు సంక్షేమం విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించాలంటే అది ఒక్క కేసీఆర్ కి సాధ్యమని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వం పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు, రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి డివిజన్ అధ్యక్షులు శంకరయ్య పుప్పాల భాస్కర్,
అబ్దుల్ ఖదీర్, రషీద్ బైగ్, మఖ్సూద్ అలీ, బాలు నేత, తేజ యాదవ్, మరియు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.