SAKSHITHA NEWS

సాక్షిత : టి‌పి‌సి‌సి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ లోని డి.పోచంపల్లి సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు మరియు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,కానీ నేడు భారాస ప్రభుత్వం టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి,కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని,కానీ రైతులు భారాస ప్రభుత్వాన్ని నమ్మే పరిస్తితి లేదు అని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని సబ్సిడీలను తీసివేసి,రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని,రైతులందరూ ఈ సారి భారాస ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని తెలిసే ఇలాంటి నీచపు చేస్తాలకు దిగజారుతుందని తెలిపారు.భారాస ప్రభుత్వం ఎన్ని జిమ్మీక్కులు చేసినా ఈ సారి ఏర్పడబోయేది రైతు సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,కౌన్సిలర్ శివకుమార్ గౌడ్,పి‌ఏ‌సి‌ఎస్ డైరెక్టర్ డప్పు నరేందర్,దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అక్బర్, దుండిగల్ మున్సిపాలిటీ ఓ‌బి‌సి సెల్ అధ్యక్షులు కుమార్ యాదవ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దుండిగల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫాతిమా,ప్రధాన కార్యదర్శి సాధు యాదవ్,సైఫ్,చెలకల శ్రీకాంత్,మాజీ వార్డు సభ్యులు పరశురాం గౌడ్,రాష్ట్ర ఓ‌బి‌సి సెల్ కొ ఆర్డినేటర్ భరత్ గౌడ్,మైనారిటీ సెల్ రాష్ట్ర జాయింట్ కొ ఆర్డినేటర్ సమీర్ ఖాన్,131 డివిజన్ ఇంచార్జ్ ఇరుగు రాధాకృష్ణ,127 డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్,131 డివిజన్ సేవాదళ్ ఛైర్మన్ బండ నవీన్,జయభేరి గోపాల్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు బాతుల చిరంజీవి,చెవిటి శ్రీనివాస్,బొట్ల నాగరాజు,భాస్కర్,చైతన్య సాయి,సంపత్,మిద్దెల సీతారాం రెడ్డి,అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS