శంకర్‌పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పునస్కరించుకొని రేవతి హై స్కూల్ ఆవరణలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 13వ తేదీన మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీం భరత్ సతీమణి జ్యోతి హాజరవుతారన్నారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతి రూ. 3000, ద్వితీయ బహుమతి రూ. 2000, తృతీయ బహుమతి రూ. 1000 నగదుతో పాటు, మిగతా మహిళలకు షీల్డ్ బహుమతులను అందజేస్తామన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు ఎవరి రంగులు వారే తెచ్చుకోవాలని సూచించారు. కావున మున్సిపాలిటీ మరియు మండలంలోని అన్ని గ్రామాల మహిళలు, విద్యార్థినీలు అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.
శంకర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం
Related Posts
శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం
SAKSHITHA NEWS శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామివారి అంబారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ప్రారంభమై చింతల్ లో ఉన్న శ్రీ…
ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు
SAKSHITHA NEWS ఆకుల సతీష్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోండి అంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు మల్లన్న గిదేంది.. సర్వే నెంబర్ 166,167, సూరారం కుత్బుల్లాపూర్ మండలంలో CMR స్కూల్ ఆవరణంలో ప్రభుత్వ భూమి 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి…