కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ ప్రతినిధి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం కొలన్. హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశ సేవ కోసమే తమ జీవితాలను పణంగా పెట్టి.. ప్రజల కోసమే తమ ప్రాణాలను అర్పించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీపై బీజేపీ ఇలాంటి విషప్రచారాలు చేయడం దౌర్భాగ్యం అని అన్నారు.దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయేనని.. ఆయనను విమర్శించే హక్కు మోదీ, బీజేపీలకు లేదన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా.. కేంద్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…