Confusion of posters in Amrabad.MLA Guvwala, who was sold for 100 crores
అమ్రాబాద్ లో పోస్టర్ల కలకలం.. 100 కోట్లకు అమ్ముడు పోయిన ఎమ్మెల్యే గువ్వల అంటూ.. అచ్చంపేట : రాష్ట్రంలో ఫామ్ హౌస్ వ్యవహారం రోజు రోజుకు కొత్త కోణాలు బహిర్గతం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించి మరోసారి నగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పై నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం లో ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం మండలంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..అమ్రాబాద్ మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి అచ్చంపేట ఆత్మగౌరవం 100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజని, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరుముదామని, ఓట్లేసి గెలిపించిన ప్రజలారా మేధావుల్లారా యువకుల్లారా విద్యావంతుల్లారా ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలని పోస్టర్లు పొందుపరిచారు. అలాగే వివిధ సందర్భాలలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ పోస్టల్ లో ముద్రించి మండల కేంద్రంలో అతికించారు. ఈ విషయం ప్రస్తుతం నియోజకవర్గంలో వాడి వేడిగా చర్చగా మారింది. కేసులు పెట్టేందుకు... ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై గుర్తు తెలియని వ్యక్తులు అమ్రాబాద్ మండల కేంద్రంలో పోస్టల్ వేసిన తీర్పు నిరసనగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. శాంతిభద్రతలు.. ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలం ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం కావడంతో శాంతి పద్ధతులు విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీల రొంపిలో కొందరు అమాయకులను రంగంలోకి దింపి వారి జీవితాలతో చెలగాటం ఆడుకునే రాజకీయ నాయకులకు తగునా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ వేడి వాతావరణం లో ఒకరిపై ఒకరు విమర్శలు ఆందోళన కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. ప్రశాంతంగా ఉన్న అమ్రాబాద్ మండలాన్ని వివాదాల్లోకి నెట్టేసి, పైశాచిక ఆనందం పొందడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని, కొందరు అమాయకులు బలి అవుతారని ఇలాంటి రాజకీయాలు సహేతుకం కాదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.