స్పందనపై స్పందించని ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేసిన కమిషనర్ హరిత ఐఏఎస్

Spread the love

సాక్షిత తిరుపతి : స్పందనపై, జగనన్నకు చెబుదాము కార్యక్రమంలో అందిన పిర్యాధులకు వెంటనే స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 10 వ వార్డు సచివాలయములోని వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ కె. కిషోర్ బాబు స్పందన గ్రివేన్స్ ని ఈ నెల 23వ తేది నుండి ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు పలుమార్లు హెచ్కరించినను, సమస్యను పరిష్కరించక కాలయాపన చేసినందున, అదే విధముగా రాజీవ్ నగర్ జీవకోన 46/1 వార్డులోని కె.ఆనంద్,అమినిటీస్ సెక్రటరీ, స్పందన నందు వచ్చిన గ్రీవెన్స్ కి సమాధానమును ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి అనుమతి పొందక అతనే స్పందన పోర్టల్ నందు నిర్లక్ష్యముగా సమాధానమును అప్లోడ్ చేసినందున సదరు గ్రీవెన్స్ మరలా రీ ఓపెన్ అయి స్పందన ఆడిట్ నందు మరలా వచ్చినందున ఇతనిని కూడా సస్పెండ్ చేస్తూ కమిషనర్ అర్డర్ ఇవ్వడం‌ జరిగింది. కావున వార్డు సచివాలయ పరిధిలోని అందరు వార్డు సెక్రటరీలు స్పందన గ్రివేన్స్ లకు సరియైన సమాధానముతో ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి అనుమతి పొంది సత్వరమే పరిష్కరించి, ఎప్పటికప్పుడు స్పందన గ్రివేన్సులకు మానిటరింగ్ చేసుకొని పరిష్కరించవలసినదిగా కోరడమైనదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు.*

Related Posts

You cannot copy content of this page