Commissioner Anupama inspected the Kothapally layout
కొత్తపల్లి లేఅవుట్ ను పరిశీలించిన కమిషనర్ అనుపమ
సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన ఇంటి నిర్మాణ కార్మికులను పెంచుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. ఎం.కొత్తపల్లి లే అవుట్ లోని ఇంటి నిర్మాణాలను అధికారులతో కలిసి పరిశీలిస్తూ వేగవంతంగా పనులను చేపట్టి సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయాలని, అనుకున్న మేరకు మొదటి విడత గృహప్రవేశాలకు ఇళ్ళను సిద్దం చేయాలని కమిషనర్ అనుపమ అన్నారు.
తిరుపతి అర్భన్ నివాసితులకు ఎం.కొత్తపల్లిలో కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, లబ్ధిదారుల సహకారంతో ఇరవై ఇళ్ళను గృహ ప్రవేశాలకు సిద్దం చేస్తున్నట్లు అధికారులు కమిషనర్ కి వివరించారు.
లే అవుట్లో ఇంటి నిర్మాణ పనుల్లో ఇబ్బంది రాకుండ ఇంటి యజమానులు, హౌసింగ్ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని కమిషనర్ అనుపమ తెలిపారు. లే అవుట్ పరిశీలనలో కమిషనర్ వెంట డిఈ సంజీవ్ కుమార్, హౌసింగ్ సిబ్బంది, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు