SAKSHITHA NEWS

జగనన్న లేఔట్ లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి.
*కమిషనర్ అనుపమ అంజలి


సాక్షిత : జగనన్న హౌసింగ్ లేఔట్ లలో లబ్ధిదారులకు అన్నిరకాల సమాచారం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.
నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించిన ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న కాలనీ ఇంటి నిర్మాణ పనులను నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
తమ ఇంటి నిర్మాణాలను చూసుకునేందుకు వచ్చిన లబ్దిదారులతో కమిషనర్ మాట్లాడగా, తమ ఇంటి నిర్మాణాలు వేగంగా జరుగుతుండడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో తమ ప్లాట్లను, ఇంటి నిర్మాణాలను పరిశీలించుకునేందుకు వచ్చే లబ్ధిదారులకు సిబ్బంది అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో లేఔట్ లో ఒక్కో రూమ్ తీసుకుని అందులో కంప్యూటర్ ఏర్పాటు చేసి, ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గృహాల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రతి లేఔట్ లోని అన్ని బ్లాక్కుల కు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం రాకుండా చూసుకోవాలన్నారు. ఇప్పటికే పూర్తి అయిన గృహాలకు పెయింటింగ్ పనులు కూడా త్వరగా చేయించాలని అధికారులను ఆదేశించారు.
కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, హౌసింగ్ డి.ఈ లు మోహన్, శ్రీనివాస్, అమెనిటీ సెక్రెటరీ లు, హౌసింగ్ సిబ్బంది ఉన్నారు.


SAKSHITHA NEWS