ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Spread the love

ఘనంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

— తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషి మరువలేనిది – ఎమ్మెల్యే చిరుమర్తి

— ఉద్యమకారులు పాత్రికేయులకు ఘనంగా సన్మానం

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

తెలంగాణ అవతరణ దశాభ్ధ ఉత్సవాల్లో భాగంగా
తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ సంస్మరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలో సువర్ణ గార్డెన్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉద్యమకారులు పాత్రికేయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ఉద్యమకారులని, వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. అనంతరం
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అశువులు బాసిన ఎందరో త్యాగదనుల పోరాట కృషి ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల యొక్క కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. అనంతరం
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అమరుల త్యాగాలు మరువలేనివని వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నీళ్లు, నిధులు నియామకాలలో జరుగుతున్న అన్యాయంపై అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ పోతుందని అన్నారు.

దశాబ్దాల పోరాటం,ఎందరో ప్రాణాల త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ మార్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం నలుమూలల తెలిసేలా చేసిన ఘనత పాత్రికేయులదని వారి కృషి మరువలేనిదని అన్నారు. అంతకుముందు పట్టణ కేంద్రంలోని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తూ శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం యాదవ్, జడ్పిటిసి లు ధనలక్ష్మి నగేష్, సుంకరి ధనమ్మ యాదగిరి, పున్న లక్ష్మీ జగన్మోహన్, చిట్యాల సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు గంట్ల శ్రీనివాస్ రెడ్డి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, ఉద్యమకారులు, పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page