SAKSHITHA NEWS

Collector inspected the Republic Day arrangements

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా లో 74వ భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బుధవారం స్వయంగా పరిశీలించారు.స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వేడుకలకు సంబంధించిన వేదిక, ప్రదర్శన స్టాళ్లు,సిటింగ్ మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాట్లను సంయుక్త కలెక్టరు యం.నవీన్ తో కలిసి పరిశీలించిన కలెక్టర్ ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలని రెవిన్యూ డివిజనల్ అధికారి బి.శాంతిని కలెక్టర్ ఆదేశించారు.

సాంస్కృతిక ప్రదర్శనలు,శకఠాల ప్రదర్శనలు,పశంసా పత్రాల పంపిణీ సకాలంలో కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో రెవిన్యూ డివిజనల్ అధికారి బి.శాంతి, తహశీల్ధార్ యన్.వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పథక సంచాలకులు డా. డి.వి.విద్యాసాగర్,యం.కిరణ్ కుమార్, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.వి.ప్రసాదరావు,జిల్లా చీఫ్ కోచ్ యం.మాధురీలత, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యస్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS