వరద బాధితుల సహాయార్ధం బియ్యం,నిత్యావసరాల వస్తువులు,బట్టలు,దుప్పట్లు సామాగ్రి సేకరణ

Spread the love

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ తరుపున, స్థానిక డివిజన్ ఆయా కాలనీ,అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారి సహకారంతో భారీ వర్షాల కారణంగా ఇటీవలే ములుగు జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగిన నేపథ్యంలో జిల్లా నియోజిక వర్గం దొడ్ల,మేడారం వంటి ప్రాంతాల్లో వరద బాధితుల సహాయార్ధం బియ్యం,నిత్యావసరాల వస్తువులు,బట్టలు,దుప్పట్లు సామాగ్రి సేకరణ,వంటివి దాదాపు వెయ్యి మంది వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుంది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లపుడూ కృషి చేస్తుందని,అదే విధంగా వరద బాధితులకు అండగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న 9వ డివిజన్ కార్పొరేటర్ రజిత రవికాంత్ కి,మరియు డివిజన్ వాసులకు అభినందనలు తెలిపి,వరదల్లో నష్టపోయిన బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవికాంత్,NMC బిఆర్ఎస్ జాయింట్ సెక్రటరీ దండుగుల స్వామి,స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్,శెషి,దుర్గా రెడ్డి,ఫణి కుమార్,శేషు,రాజు,రమేష్,సురేష్,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page