CMRF scheme for poor families
పేద కుటుంబాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
సాక్షిత న్యూస్, మంథని:
40ఏండ్లు మంథని ప్రాంతాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ పాలకులు ప్రజల ఓట్లతో అధికారం చేపట్టి ఆస్తులు కూడబెట్టుకుని అందలం ఎక్కారే కానీ ఏనాడు పేద ప్రజలను ఆదుకోవాలని ఆలోచన చేయలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు.
మంథని పట్టణంలోని రాజాగృహలో మంథని నియోజకవర్గంలోని మంథని,ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలకు చెందిన 62 మందికి మంజూరైన రూ.15.75లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎప్పుడైన ఎక్కడైనా వరదలు వస్తేనే విపత్తు జరిగితే తప్ప ముఖ్యమంత్రి సాయం అందేది కాదని,కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతిపేదవాడికి కార్పోరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నారని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పాలకులు ప్రజలను ఓట్ల యంత్రాలుగానే చూశారే కానీ ఏనాడు వారి ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన సందర్బాలు లేవన్నారు.
ఈనాడు పేద ప్రజలు కార్పోరేట ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లులు అందజేస్తే వారికి చెక్కుల రూపంలో ఎల్‌ఓసీల రూపంలో అందించడం జరుగుతుందని ఆయన వివరించారు.ఎంతో మంది పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా సాయం అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి సహయ నిధి పథకం పేద కుటుంబాలకు అండగా నిలువడంతో పాటు భరోసా కల్పిస్తుందన్నారు. అయితే ప్రజలు కూడా నాయకుల వ్యవహరశైలిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, అనేక ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలను వాడుకుని ఎప్పుడో చుక్క రాలినట్లు వచ్చే వారి గురించి ఆలోచన చేయాలని ఆయన సూచించారు.