సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

Spread the love

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

157 మందికి గాను రూ.59.96 లక్షల విలువైన చెక్కులు పంపిణీ..

నేటి వరకు 4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌కి స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు దరఖాస్తు చేసుకుని మంజూరైన చెక్కులను వీడియోస్ కాలని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
నియోజకవర్గ పరిధిలో మంజూరైన మొత్తం 157 మందికి గాను రూ.59.96 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు 4276 చెక్కులకు గాను రూ. 18.58కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గతంలో రూ.10వేలు మంజూరు అయితే చాలా గొప్ప విషయం అని అన్నారు. స్థానిక శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ప్రవాహం నిర్విరామంగా కొనసాగుతుందని, ఇలానే కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు. పేదరికంలో ఉండి అతి కష్టం మీద వైద్య చేయించుకున్న వారికి ఆర్ధిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కల్పించిన మంచి సదవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నామని, అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అత్యవసర సందర్భాల్లో ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని సీఎంఆర్ఎఫ్ ను కల్పించిందన్నారు. ప్రజల సౌకర్యార్థం క్యాంపు కార్యాలయంలో నిత్యం ఒక వ్యవస్థ సీఎంఆర్ఎఫ్ కోసమే పని చేస్తుందని ప్రజలు ఈ సౌకర్యాన్ని మరింతగా సద్వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు పసుమర్తి రాంమోహన్, పాకాలపాటి విజయ, దందా జ్యోతి రెడ్డి, ఏఎంసి చైర్మన్ శ్వేత, నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, షకీనా, ఇస్సాక్ రఘు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page