తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని కి అదే ఉద్యోగాన్ని మళ్లీ ఇవ్వడానికి ఇబ్బందేంటని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో జాబ్ ఇవ్వాలని సూచించారు.
పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగాని వదులుకున్న నళినికి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకన్నారు.
రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, ఆమెకు ఎందుకు అన్యాయం జరగాలని ప్రశ్నించారు. ఉద్యోగంలో చేరడానికి నళిని ఆసక్తికనబరిస్తే వెంటనే ఇప్పించాలని ఆదేశాలు జారీ చేశారు.