CM KCR's quest is to keep RTC alive
ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్ తపన
••- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
•- ఎన్నికల కోడ్ వల్లే పీఆర్సీ ఆలస్యం
•- ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు 100 కోట్లు మంజూరు
•- త్వరలో మూడు డీఏలతో పాటు పాత బకాయిల చెల్లింపు
•- సకల జనుల సమ్మె జీతాలకు 25 కోట్లు కేటాయింపు
*సాక్షిత : టీఎస్ ఆర్టీసీని బతికించాలన్నదే సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చి చెప్పారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ స్థానిక ప్రభుత్వాలు ఆర్టీసీలను ఆదుకోవడం లేదని, తెలంగాణలో మాత్రమే ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉన్నదని మంత్రి తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
కార్పొరేషన్లు ప్రైవేటుకు విక్రయిస్తే రూ.2 వేల కోట్ల వరకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రాష్ట్రంలోని 49 వేల మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఆర్టీసీకి అన్నివిధాలా సీఎం కేసిఆర్ అండగా నిలుస్తున్నారన్నారు.