గద్వాల సీఐగా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ను వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడం తో ఆ స్థానంలో నాగర్ కర్నూలు జిల్లా నుండి బదిలీపై టాటాబాబు ను నియమించారు.
ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా సీఐ టాటాబాబు మాట్లాడుతూ…శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు.అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.బాధ్యతలు స్వీకరించిన సీఐకు గద్వాల్ సర్కిల్ ఎస్ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.