బాధ్యతలు స్వీకరించిన సీఐ టాటా బాబు

Spread the love

గద్వాల సీఐగా టాటా బాబు బుధవారం బాధ్యతలు చేపట్టారు.సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్ ను వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడం తో ఆ స్థానంలో నాగర్ కర్నూలు జిల్లా నుండి బదిలీపై టాటాబాబు ను నియమించారు.

ఈ సందర్భంగా సర్కిల్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా సీఐ టాటాబాబు మాట్లాడుతూ…శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు.అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.బాధ్యతలు స్వీకరించిన సీఐకు గద్వాల్ సర్కిల్ ఎస్‌ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page