SAKSHITHA NEWS

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – సీఐ శివరాం రెడ్డి
నార్కట్పల్లి బీసీ కాలనీలో పోలీసుల కార్దన్ అండ్ సెర్చ్
నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

ఆన్ లైన్ మోసాలు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కట్ పల్లి సీఐ శివరాం రెడ్డి కోరారు. నార్కట్పల్లి పట్టణంలోని బీసీ కాలనీలో సిఐ శివరాం రెడ్డి నార్కట్పల్లి ఎస్సై సైదా బాబు, చిట్యాల ఎస్ఐ రవి మరియు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1కార్ ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ శివరాం రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్కట్పల్లి పట్టణంలోని బీసీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామని అన్నారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసామని అందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశామని సరైన ధ్రువపత్రాలు చూపించినచో వారి వాహనాలు వారికి అప్పగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మనోధైర్యం కలగాలని కమ్యూనిటీ పోలీసింగ్ గురించి వివరించామని అన్నారు. దొంగతనాలు ఆన్లైన్ మోసాలు రోడ్డు ప్రమాదాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ముఖ్యంగా బీసీ కాలనీలో సీసీ కెమెరాలు తక్కువగా ఉన్నాయని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించామని తెలిపారు.

WhatsApp Image 2023 06 17 at 6.42.42 PM

SAKSHITHA NEWS