SAKSHITHA NEWS

Children’s Day celebration at Sarvajna School

సర్వజ్ఞ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుక

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

సోమవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా సర్వజ్ఞ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నెహ్రూ చిత్రపటానికి పాఠశాల డైరెక్టర్ శ్రీమతి కె.నీలిమా పూలమాల వేసి నమస్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉంది.” “దేశ భవితవ్య నిర్మాణం జరిగేది పాఠశాలల్లోనే గాని, పార్లమెంట్లో కాదు.”, అన్న నెహ్రూ మాటలు విద్యార్థులకు గుర్తుచేసి విద్యార్థులను ఉద్దేశించి మీరు కూడా నెహ్రూ అంతటి గొప్పవారుకావాలని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ట్రాఫిక్ సి.ఐ. అంజలి విచ్చేశారు. జోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ‘నేటి బాలలే రేపటి పొరలని, ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని దాని కొరకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు.

అలాగే సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలపై అవగాహన కలిపించారు. అదేవిధంగా ఆమె మాట్లాడుతు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన మొట్ట మొదటి ప్రధానమంత్రి మన నెహ్రూగారేనని, ఆయనకు పిల్లలంటే అమితమైన ఇష్టమని,

నవంబరు 14న ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా గుర్తించాలని చాచానెహ్రూ చెప్పారని అందుకే మనం నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని “విద్యార్థులకు పునాది పాఠశాల అని నేటి విద్యాలయాలే ఆధునిక

దేవాలయాలని” నెహ్రూగారు అన్న మాటలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఈ వేడుకలలో విద్యార్థులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన చాచానెహ్రూ, గాంధీజీ మరియు వివిధ నాయకుల వేషధారణలలో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విద్యార్థులలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి.

ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరక్టర్స్, ఆర్.వి. నాగేంద్ర కుమార్, నీలిమీ , ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


SAKSHITHA NEWS