వేల్పుల అనిల్ కు మార్పు స్వచ్ఛంద సంస్థ చేయూత.

Spread the love

వేల్పుల అనిల్ కు మార్పు స్వచ్ఛంద సంస్థ చేయూత.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి (ఎ.జి) నివాసి వేల్పుల అనిల్ కుమార్ (25) కు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో 6000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మార్చి 11వ తారీఖున ఏన్కూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వలన వేల్పుల అనిల్ కుమార్ గుండెకు బలమైన గాయం కావడంతో ఖమ్మంలోని సంకల్ప హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వేల్పుల అనిల్ కుమార్ గుండె లోపల బ్లీడింగ్ అవుతుందని, వైద్యానికి 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు.

మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత హాస్పిటల్ కు వెళ్లి వేల్పుల అనిల్ కుమార్ ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు 6000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ వేల్పుల అనిల్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారని, అనిల్ అమ్మ కూలి పనులు చేస్తూ జీవిస్తుందని, నిరుపేద కుటుంబానికి ఆధారం అయిన అనిల్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని దాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిమెట్ల మోహనరావు, గుడిమెట్ల నాగరాణి, గుడిమెట్ల వెంకటేష్, వేల్పుల జ్యోతి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page