ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌

Spread the love

ముంబయిలో జరిగిన ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో చంద్రగిరి యువతి భావన విన్నర్‌గా నిలిచింది. శుక్రవారం చంద్రగిరిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు భావన…

వాయిస్ : ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవుతానని మిస్ ఇండియా కేజేయం గేమ్స్ ఎంటర్టైన్మెంట్ ఐకానిక్ దివా సీజన్ 3 2023 మిస్ ఇండియా టైటిల్ విన్నర్ భావన తెలిపారు. తల్లిదండ్రులు గోపికృష్ణ, లక్ష్మి, తమ్ముడు దరహాస్‌లతో కలిసి భావన మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నానన్నారు. భవిష్యత్ లో సైంటిస్ట్ కావడమే తన లక్ష్యమని తెలిపారు. ఇక భారతదేశం మొత్తం నుండి ఈ టైటిల్ కోసం గత 15 రోజుల కిందట 1000 మంది పోటీపడ్డారన్నారు. ద్వితీయ స్థానంలో 300 మంది నిలవగా, టాప్ 20లో తాను ప్రవేశించి ముంబైలో గత నాలుగు రోజులు జరిగిన ఫైనల్స్ లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మిస్ ఇండియా కిరీటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. కవిత కిషోర్, రియాన్ శర్మలని తనకు రోల్ మోడల్స్ అని తెలుపుతూ వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సమాజ సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

బైట్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page