SAKSHITHA NEWS

ప్రపంచ శాంతి కొరకు శ్రీకృష్ణుని కళ్యాణం జరపటం అభినందనీయం…..

-డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

శ్రీకృష్ణ పరమాత్ముని ద్వారా భగవద్గీత సృష్టించబడిందని, జగత్ కళ్యాణం కొరకు మహాభారత యుద్ధం జరిపించారని, మనం చేసుకున్న కర్మల ఫలితంగా మన జనన మరణాలు నిర్ణయించబడతాయని లోకానికి చాటి చెప్పిన మహా పురుషుని కళ్యాణం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని డిసిసిబి డాక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. పౌర్ణమి సందర్భంగా
తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో చెన్ను భాస్కర్, కళావతి దంపతులచే శ్రీకృష్ణుని కళ్యాణం మరియు తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో మండపంలో శ్రీకృష్ణుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా తోరణాలతోమండపం అలంకరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ యాదవ కుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం ఇదే రోజున ఆనవాయితీగా జరుపుకోవడం అభినందనీయమని, ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కర్నీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు వాగదాని రామకృష్ణ యాదవ్ చిర్ర లింగయ్య పెద్ద మింగిరాజు పూల వెంకన్న బాల యేసు,శివకృష్ణ, గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత ఉపసర్పంచ్ గోవిందు, పంపాద్రి, బుజ్జి, కోసూరి సురేష్, గోపయ్య, తల్లాడ మండల యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS