కాస్కేడ్ పిక్చర్స్ –  ‘అలిపిరికి అల్లంత దూరంలో ” నవంబర్ 18న విడుదల

Spread the love

Cascade Pictures – ‘Far from Alipiri’ releases on November 18

కాస్కేడ్ పిక్చర్స్ –  ‘అలిపిరికి అల్లంత దూరంలో ” నవంబర్ 18న విడుదల

కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  అలాగే ‘మా తిరుపతి’ పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయిది. నవంబర్ 18న ఈ చిత్రం థియేటర్లో విడుదలౌతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. వింటేజ్ డేస్ ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది.

తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్ధమౌతుంది.  

నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డిజికె డీవోపీగా పని చేస్తున్నారు.

 నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి
లహరి గుడివాడ

టెక్నికల్ టీం :
దర్శకత్వం: – ఆనంద్ జె
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
డీవోపీ: డిజికె
సంగీతం : ఫణి కళ్యాణ్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : తేజస్వి సజ్జా

Related Posts

You cannot copy content of this page