SAKSHITHA NEWS


Caraf Address for General, Laparoscopic, Laser Surgery Sri Abhaya Hospital

జనరల్, లాప్రోస్కోపిక్ , లేజర్ సర్జరీకి కేరాఫ్ అడ్రస్ శ్రీ అభయ హాస్పిటల్


జనరల్, గ్యాస్ట్రో, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్, లేజర్ సర్జరీలు, తోపాటు వివిధ అత్యవసర కేసులను అతితక్కువ ఖర్చుతో హైదరాబాద్ తరహా అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఖమ్మం లోని వైరా రోడ్ లో గల శ్రీ అభయ హాస్పిటల్ లో 24 గంటలూ నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు (సర్జన్) ఎస్.కె మహబూబ్ బాషా (ఎం అర్ సి ఏస్ ఇంగ్లాండ్, డీ న్ బి) అన్నారు.

దాదాపు అన్ని రకాల వైద్య సేవలు తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సాక్షిత న్యూస్ తో తమ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు. ముఖ్యంగా తాను పర్యవేక్షించే జనరల్ సర్జరీవైద్యానికి సంబంధించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు

.
అభయ హాస్పిటల్ డాక్టర్ మహబూబ్ బాషా తో సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్ మదర్ సాహెబ్ ముఖాముఖి.

శస్త్ర చికిత్స అనగానే జనంలో అదో రకం భయంగా ఏర్పడుతుంది కానీ మన ఖమ్మం నగరంలో శ్రీ అభయ హాస్పిటల్ డాక్టర్ మహబూబ్ బాషా పెరిగిన అధునాత పరికరాలతో శస్త్ర చికిత్స చేస్తే రోగి భయపడనవసరం లేదని అంటున్నారు.

ప్రతినిధి: అసలు పెరిగిన అధునాతన పరికరాలతో సులువైన శస్త్రచికిత్స అంటే ఏంటి

డాక్టర్: ఇంతకుముందు కాలంలో సాధారణ శస్త్ర చికిత్సలు చేసేవారు దానినే జనరల్ లేదా ఓపెన్ సర్జరీ అంటారు ఓపెన్ సర్జరీ అంటే పెద్ద పెద్ద కోత అధిక రక్తస్రావం రోగి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం మరియు తిరిగి అతను పనులు చేసుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టేది కానీ ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ లాప్రోస్కోపీ మరియు లేజర్ తో శాస్త్ర చికిత్సలు చేస్తే రోగి త్వరగా కోలుకుంటారు

ప్రతినిధి: సాధారణ శాస్త్ర చికిత్సలకు మరియు లాప్రోస్కోపీ విధానానికి తేడా ఏంటి

డాక్టర్: లాపరోస్కోపిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్వాసివ్ ప్రొసీజర్ అని కూడా పిలుస్తారు , బాండేడ్ సర్జరీ లేదా కీహోల్ సర్జరీ, ఇది ఒక ఆధునిక శస్త్రచికిత్సా సాంకేతికత. అన్వేషణాత్మక లాపరోటమీకి వ్యతిరేకంగా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సతో రోగికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

వీటిలో చిన్న కోతలు, తగ్గిన రక్తస్రావం మరియు తక్కువ కోలుకునే సమయం కారణంగా నొప్పి తగ్గుతుంది. ప్రధాన అంశం లాపరోస్కోప్‌ను ఉపయోగించడం , ఇది పొడవైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సిస్టమ్, ఇది కేబుల్‌ను మరింత సుదూర, కానీ మరింత సులభంగా యాక్సెస్ చేయగల ప్రదేశం నుండి స్నేక్ చేయడం ద్వారా ప్రభావిత ప్రాంతాన్ని వీక్షించడానికి అనుమతిస్తుంది.


లాపరోస్కోపిక్ సర్జరీలో పొత్తికడుపు లేదా పెల్విక్ కావిటీస్‌లోని ఆపరేషన్లు ఉంటాయి, అయితే థొరాసిక్ లేదా ఛాతీ కుహరంపై చేసే కీహోల్ సర్జరీని థొరాకోస్కోపిక్ సర్జరీ అంటారు. లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలో ఉపయోగించే నిర్దిష్ట శస్త్రచికిత్సా పరికరాలలో ప్రసూతి ఫోర్సెప్స్ , కత్తెరలు, ప్రోబ్స్, డిసెక్టర్లు, హుక్స్ మరియు రిట్రాక్టర్లు ఉన్నాయి. లాపరోస్కోపిక్ మరియు థొరాకోస్కోపిక్ శస్త్రచికిత్సలు ఎండోస్కోపీ యొక్క విస్తృత రంగానికి చెందినవి . మొదటి లాపరోస్కోపిక్ ప్రక్రియను జర్మన్ సర్జన్ జార్జ్ కెల్లింగ్ 1901లో నిర్వహించారు.


ఇంతకుముందు చెప్పుకున్నట్లు సాధారణ శాస్త్ర చికిత్సలు పెద్ద కోత అధిక రక్తస్రావం ఉంటది. పేషెంట్ కోలుకోవడం కూడా కాస్త సమయం ఎక్కువ పట్టింది కానీ లాప్రోస్కోపీలో చిన్న హోల్స్ పెట్టి హోల్స్ ద్వారా మిషిన్ ని పంపించి చేస్తారు దీన్ని కీ హోల్ సర్జరీ కూడా అని అంటారు

దీనివల్ల పేషెంట్ ఆసుపత్రి నుంచి ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు రక్తస్రావం చాలా తక్కువ మరియు కోత చాలా చిన్నదిగా ఉంటుంది లాప్రోస్కోపీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగి ఇంటికి వెళ్ళిన తర్వాత తన పనులు తన సొంతంగా చేసుకోవచ్చు అదే ఓపెన్ సర్జరీలో అయితే కొన్ని నెలలు విశ్రాంతి అవసరము. దీనితో పాటు మన దగ్గర లేజర్ సర్జరీ కూడా చేస్తున్నాము. ఆ సర్జరీ వల్ల రోగి ఇంకా త్వరగా కోలుకుంటారు

.

ప్రతినిధి: సాంప్రదాయ శస్త్రచికిత్స కంటే లేజర్ శస్త్రచికిత్స ఎలా మంచిది?

డాక్టర్: సాంప్రదాయ శస్త్రచికిత్స కంటే అనేక ప్రయోజనాలను అందించే డే-కేర్ విధానం లేజర్ సర్జరీ లేదా లేజర్ థెరపీ. బ్యాండింగ్ శస్త్రచికిత్సతో పోలిస్తే, లేజర్ హేమోరాయిడ్స్‌కు సమర్థవంతంగా చికిత్స చేస్తుంది, లక్షణాలను మెరుగుపరుస్తుంది మరియు శస్త్రచికిత్స అనంతర నొప్పిని తగ్గిస్తుంది. తీవ్రమైన అనల్ స్పస్మ్స్ ,ఎక్స్టర్నల్ త్రంబోసిస్ ,ఫిషర్ మరియు సెంటినెల్ తగ్స్ , ఫిస్టులా ఉన్న రోగులకు ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తాయి.


తక్కువ ఆపరేషన్ సమయం, కొన్ని గంటల్లో రోగిని ఇంటికి పంపించవచ్చు.
3-5 రోజుల్లో సాధారణ జీవితం, శస్త్రచికిత్స ఖచ్చితత్వం మచ్చలు లేని కుట్టులేని చికిత్స
కోతలు లేదా కుట్లు లేనందున వేగంగా కోలుకోవడం లక్షణాల నుండి త్వరగా ఉపశమనం
శస్త్రచికిత్స సమయంలో తక్కువ రక్త నష్టం


శస్త్రచికిత్స అనంతర నొప్పి ఉండకపోవడం
సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించింది రెక్టల్ స్టెనోసిస్
లేదా ప్రోలాప్స్ ప్రమాదాన్ని తగ్గించింది సౌందర్యంగా ఉత్తమ విధానాలు – రోగికి విశ్వాసం పెంచేదిగా సహాయపడుతుంది. అనల్ స్ఫింక్టర్ చర్య బాగా సంరక్షించబడుతుంది, (ఆపుకొనలేని మలం లీక్ అయ్యే అవకాశాలు లేవు).
తక్కువ పునరావృత రేట్లు


శస్త్రచికిత్స అనంతర వైద్యులు తక్కువ
అధిక విజయ రేట్లు
సాధారణ అనస్థీషియా అవసరం లేదు. ఈ శస్త్రచికిత్సకు స్థానిక లేదా వెన్నెముక అనస్థీషియా వర్తిస్తుంది.

ప్రతినిధి: మీ అభయ హాస్పిటల్ లో ఎలాంటి సర్జరీలు చేస్తున్నారు

డాక్టర్: మా హాస్పిటల్ లో ప్రధానంగా జనరల్ సర్జరీ విభానికి వచ్చి 24 గంటలు కడుపు నొప్పి, గర్భసంచి, అండాశయం గడ్డలు, వరిబీజం, హెర్నియా, కాలేయ క్రింద చేదు తిత్తిలోని రాళ్లు తొలగించడం, మొలలు ,ఫిషర్, ఫిస్టులా మరియు గ్యాస్ట్రో సంబంధించిన పెద్ద పేగు, చిన్నప్రేగు శస్త్ర చికిత్సలు క్యాన్సర్ శస్త్ర చికిత్సలు వెరికోసిల్ వైన్స్, మొదలైనవి చేస్తున్నాం.
మా దగ్గర అన్ని లాప్రోస్కోపి మరియు లేజర్ తో శస్త్ర చికిత్సలు చేస్తున్నాం.

ప్రతినిధి: మీ హాస్పిటల్లో ఇంకా ఏ ఏ వ్యాధులకి వైద్య చికిత్సలు అందిస్తారు.

డాక్టర్: మా హాస్పిటల్ లో జనరల్ సర్జరీ తో పాటు జనరల్ మెడిసిన్ (ఎం డీ) జలుబు దగ్గు జ్వరం డెంగ్యూ ఎమర్జెన్సీ పాముకాటు పాయిజన్ కేసులు మరియు కిడ్నీ , యూరాలజీ సంబంధించిన డాక్టర్లు, న్యూరో సర్జరీ, ఎముకల శస్త్ర చికిత్స వైద్యనిపుణులు, మానసిక వైద్య నిపుణులు, హార్మోన్ ,షుగర్ సంబంధించిన ఎండోకైనాలజిస్ట్ డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మరియు పేదవారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామని గర్విస్తున్నాము.


SAKSHITHA NEWS