శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు సుధీర్ జైన్ ఆలయానికి రూ. లక్ష 111 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ జైన్ స్వామి వారిని దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు. ఆల్ ఇండియా కమిటీ చైర్మన్ దయాకర్ రాజు… సుధీర్ జైన్ కు శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం దయాకర్ రాజు మాట్లాడుతూ దాతల సహకారం మరువలేదన్నారు. సుధీర్ జైన్ మాట్లాడుతూ మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఆలయానికి విరాళాలు ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సదానందం గౌడ్, అడ్డు సంతోష్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
చందిప్ప మరకత శివాలయానికి బిజినెస్ మాన్ సుధీర్ జైన్ రూ. లక్ష 111 విరాళం
Related Posts
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి
SAKSHITHA NEWS మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి…