SAKSHITHA NEWS

ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ:
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావే శాలు ప్రారంభమయ్యాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌ నుండి పార్లమెంటు కు చేరుకున్నారు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెడు తుంది, కేంద్ర ప్రభుత్వం.. రేపు ఉదయం 11గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌.. అలాగే 16 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కేంద్రం..

ఫిబ్రవరి 13 వరకు.. మార్చి 10నుంచి ఏప్రిల్ 4వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సెషన్స్‌ జరగనున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app