SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 19 at 1.01.25 PM

పటాన్చెరువు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో నిర్వహించిన బోనాల మహాత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు,అనంతరం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,బోనాల ఉత్సవ నిర్వాహకులు క్రేన్ సహాయంతో నీలం మధు ముదిరాజ్ కు భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు,బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతిసంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్వహించుకోవడం మనకు గర్వకారణమని ఆయన తెలిపారు,బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలకు అధికార హోదా కల్పించబట్టే బోనాల ఉత్సవాల అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు,మన సాంప్రదాయాలను మనమే గౌరవించుకోవడంతోపాటు ఇతరుల సంప్రదాయాలకు విలువ ఇచ్చే విధంగా ఉండాలని ఆయన తెలిపారు పటాన్చెరు అంటే మినీ భారతదేశం అని ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారని వీరందరూ కూడా మన సహోదరులే అని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అందరినీ సమానంగా చూస్తూ సంక్షేమ పథకాలు అంద చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ ఈసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని ఆయన తెలిపారు అందువల్ల మనందరం బీఆర్ఎస్ ను ముందంజలో ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుండేలా మీకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశ్, రాజ్ కుమార్,నాయకులు శ్రీను, అభిరామ్,ఈశ్వర్, కుపాస్వామి,R భీమ,శంకర్,రాజు,మారుతి,M భీమ,నాగేష్,రాము,రాజు, ఉదయ్,నాగరాజు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS