బీఆర్ఎస్ నేత మాజీ సీఎంపై…

Spread the love

మైనంపల్లి హనుమంతరావు ఫైర్
సాక్షిత : మారని కెసిఆర్, పార్టీలో ఉన్నప్పటి నుండి చెబుతూనే వస్తున్నా?

మూడు నెలల్లోనే బీఆర్ఎస్ ఖతం..
తండ్రీ కొడుకులే కారణం..

నీలం మధును గెలిపించుకుని..
బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి

దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు

పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సారెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, పూజారి హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక : కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యే లు తనతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. కెసిఆర్ మీరు ఇంకా మారరా? నేను పార్టీలో ఉన్నప్పటి నుండి తమకు, కుమారుడికి కూడా ఇదే చెబుతూ వస్తున్నానని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం భూంపల్లి క్రాస్ రోడ్ లోని ఎస్ బీ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ… 2001 సంవత్సరంలో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే ఖతం అయిందని, దానికి తండ్రి, కొడుకులే కారణమని కెసిఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెదక్ గడ్డ బీఆర్ఎస్ దే అంటూ విర్రవీగుతున్న వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. నీలం మధు ముదిరాజును పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు.

సమానత్వ పార్టీ కాంగ్రెస్..
ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్..

దేశంలో అందరిని సమానత్వంగా చూసే పార్టీ ఒక కాంగ్రెస్ యేనని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. మెదక్ గడ్డం నుంచి పోటీ చేసి గెలిచిన ఇందిరాగాంధీ కుటుంబానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా కలిగిందన్నారు. పేదోడినైనా తనను గెలిపిస్తే, అందరికీ రుణపడి ఉంటానని నీలo మధు పేర్కొన్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. వెంకట్రాంరెడ్డి దుర్మార్గం గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page