SAKSHITHA NEWS

బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది

  • అందుకే రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తున్నారు
  • రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం
  • ట్రాన్స్ కో కు ఇవ్వాల్సిన 60వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి
  • కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • తల్లాడ మండలం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని… ఆ భయంతోనే పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించి ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి. శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిర్వహించిన ధర్నాలో భాగంగా తల్లాడ మండలం మల్లారంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.

వైయస్ సీఎం అయ్యాక తొలి సంతకం రైతుల ఉచిత విద్యుత్ ఫైల్ పైనే పెట్టారని, అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు కాగితాలకే తప్ప ఆచరణలో అమలు కావని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల నిమిత్తం ట్రాన్స్ కో కు ఇవ్వాల్సిన 60 వేల కోట్ల రూపాయాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆ నిధులు పక్కదారి మళ్లయానే ఆరోపణలు ఉన్నాయని దీనిపై విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మానవతా రాయ్, కొండూరు సుధాకర్, రఘుపతి రెడ్డి, గోపి శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS