రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో రెవెన్యూ, అసైన్మెంట్, సి.ఎల్.ఏ భూసమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఆర్.ఎల్.పి ప్రాజెక్టుకు వినియోగించిన అటవీ శాఖ భూములకు బదులుగా రెవెన్యూ భూములను సమకూర్చాలని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాయింట్ సర్వే చేపట్టాలన్నారు. సీఏ భూముల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ గోపాల్, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.