తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి.

Spread the love

తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలంగాణా కు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి పర్యవేక్షణ, సమన్వయ కమిటీ సుమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు 2023 సంవత్సరంలో 32.477 లక్షలు, 2024 సంవత్సరంలో 31.06 మొక్కలు నాటుటకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ఇట్టి లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా సాధనకు చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. లక్ష్య సాధనకు శాఖావారి, సైట్ వారిగా కార్యాచరణ సమర్పించాలన్నారు. ఇర్రిగేషన్ శాఖ భూములలో ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటుటకు చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యానవన శాఖచే రైతులను గుర్తించి పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించాలన్నారు.

గుర్తించిన బ్లాక్ ప్లాంటేషన్ చోట సంపద వనాలు ఏర్పాటుకు చర్యలు తీసుకొని ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. లే అవుట్లలో ఓపెన్ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. సత్తుపల్లి బెటాలియన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, జేఎన్ టియు లకు కేటాయించిన భూమిలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుటకు యోచన చేయాలన్నారు. క్వారీ ప్రక్రియ పూర్తయిన చోట అట్టి స్థలాల్లో మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రీడాప్రాంగణాల్లో ప్రహారీ చుట్టూ మొక్కలు నాటుటకు కార్యాచరణ చేయాలన్నారు. సింగరేణి గనుల్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. హోమ్ స్టెడ్ మొక్కల పంపిణీలో డిమాండ్ మేరకు మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ ను నర్సరీలు, నిర్వహణ, ప్లాంటేషన్, ట్రీ గార్డ్ లు, ఇతర పనుల నిమిత్తం వినియోగించాలన్నారు. పిట్టింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. సైట్ ల జాబితా సమర్పించాలన్నారు. నర్సరీల్లో గ్యాప్ లు పూరించాలని, బ్లాక్ ప్లాంటేషన్ ల దగ్గర ఫెన్సింగ్, జంగిల్ తొలగింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్లాంటేషన్ ప్రక్రియ ప్రారంభానికి అన్ని సిద్ధం చేసుకోవాలని, త్వరగా ప్లాంటేషన్ చేపడితే మొక్కల మనుగడ బాగుంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ సహాయ కమీషనర్ మల్లీశ్వరి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, జిఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, ఏడి మైన్స్ సంజయ్ కుమార్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్రాం, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, ఎఫ్డివో లు మంజుల, బాబు, మునిసిపల్ కమిషనర్లు సుజాత, వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page