బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం

Spread the love

బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

కామేపల్లి మండలం హరిశ్చంద్రాపురం గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ, పోతురాజు, అభయాంజనేయ స్వామి దేవతల విగ్రహాలు అంగరంగ వైభవంగా పచ్చని తోరణాల మధ్య, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల చేత శాస్త్రోక్తంగా వైభవంగా, ప్రతిష్టించడం జరిగింది. విశేష ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొనగా ఈ సందర్భంగా గ్రామ ప్రజలు విశేషంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ పల్లె లల్లో ప్రతి గ్రామంలో బొడ్రాయి, ముత్యాలమ్మ దేవతలని ప్రతిష్టించుకోవడం మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం అని పేర్కొన్నారు.

ఆ దేవతల చలవవల్ల గ్రామాలు ప్రశాంతంగా, పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉంటున్నాయని తెలిపారు. విగ్రహాల ప్రతిష్ట కొరకు విరాళాలు ఇచ్చిన దాతలు ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు యువకులు ఉత్సాహంతో భారీ ఎత్తునపాల్గొన్నారు. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, సర్పంచ్ రాందాస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల,ప్రసాదు, సుశీల, సాంబ,గ్రామ పెద్దలు రాందాస్,బన్సీ భాస్కర్ లాలు బాదావత్ నాగరాజు రాంజీ , రమేష్, దశరథ్, రామ్ సింగ్ రమేష్, లాల్ సింగ్,, ధర్మ దేవా,బద్రు శంకర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page