ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు*

Spread the love

*ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు*

తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు పామూర్ రోడ్డు లో గల వారి కార్యాలయంలో అశేష అభిమానులు కార్యకర్తలు, నాయకుల మధ్య అంగరంగవైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా బాణసంచా కాల్చి ఉత్సవ వాతావరణం నెలకొంది. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు విశేషముగా పాల్గొని కేరింతల నడుమ పండుగలా జరిగింది.

కేక్ కట్ చేసి నలుగురికీ పంచారు. అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా మహిళా కార్యకర్తలకు చీరలు పంచి వారి ఆశీస్సులు పొందారు. పలువురు అభిమానులు, కార్యకర్తలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు.

కార్యక్రమానంతరం అన్నదాన
కార్యక్రమం జరిగింది.
అనంతరం *కోవూరు రోడ్లో మానసిక వికలాంగుల స్కూల్లో రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి, ఫ్రూట్స్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తర్వాత *గవర్నమెంట్ హాస్పటల్లో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో రాజేష్ గారి సోదరుడు రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మొదలగువారు పాల్గొన్నారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page