మాస్టర్ ప్లాన్ రోడ్ల వెనుక మాస్టర్ మైండ్ భూమన అభినయ్ దే.

Spread the love

[7:03 pm, 15/07/2023] Sakshitha News: ఆధ్యాత్మిక నగరంలో అత్యాధునిక రహదారులు….
జగనన్న సహకారం…ప్రజల తోడ్పాటు తోనే ఇంత అభివృద్ధి సాధ్యం….
పంగుళూరు సీతమ్మ మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూమన కరుణాకర రెడ్డి…
[7:04 pm, 15/07/2023] Sakshitha News: సాక్షిత తిరుపతి : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అత్యాధునిక రోడ్లతో కళకళలాడే సాంస్కృతిక వైభవాన్ని చాటే పవిత్ర నగరంగా తీర్చిదిద్దనున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ముత్యాలరెడ్డి పల్లి వద్ద మాస్టర్ ప్లాన్ కింద 5.35 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించిన 80 అడుగుల వెడల్పు రోడ్డును
పంగుళూరు సీతమ్మ మార్గంగా నామకరణ చేస్తూ శనివారం ఉదయం భూమన కరుణాకర రెడ్డి ప్రారంభిచాంరు.‌ ఈ సందర్భంగా ప్రజలని ఉద్దేశించి భూమన మాట్లాడుతూ
ఇంత మంచి రోడ్డు నిర్మాణం వెనుక చాలా కష్టం, శ్రమ దాగుందన్నారు.
ఈ రోడ్డును ప్రారంభించ సంకల్పించిన మరుక్షణం నుంచే అనేక ఒడిదుడుకులకు లోను కావడం జరిగిందని, అడ్డు కోవాలని కూడా చూశారని వివరించారు. అయితే వీటన్నిటిని జయించి ఇంత మంచి రోడ్డు రావడానికి ప్రధాన కారణం తిరుపతి నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ అని భూమన కరుణాకర రెడ్డి ప్రశంసించారు. ఈ ఆలోచన భూమన అభినయ్ దే అన్నారు.
తిరుపతి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన శ్రీ పంగుళూరు సీతమ్మ ట్రస్ట్ సభ్యులను అభినందిస్తున్నట్టు చెప్పారు. కొత్తవీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ధూపదీప, నైవేద్యాల కోసం పంగుళూరు సీతమ్మ అనే దాత 150 సంవత్సరాల కిందట 60 ఎకరాల భూమిని దాతృత్వంతో ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మహాతల్లి పేరిట ట్రస్ట్ ఏర్పాటైందని, ఈ శుభతరుణంలో ఆ గొప్ప భక్తురాలిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆ సీతమ్మకు తిరుపతి ప్రజలు రుణపడి వుంటారని ఉద్ఘాటించారు. అలాగే సీతమ్మ ట్రస్ట్ కి భూముల్లో ఒక్క అంకణం కూడా కబ్జాకు గురికాకుండా పరిరక్షించామని తెలిపారు. ట్రస్ట్ కి వెయ్యి కోట్ల రూపాయల విలువైన స్థలం చెక్కు చెదరకుండా మిగిలేలా చేశామన్నారు‌. రాష్ట్రంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక వైపైతే, రాష్ట్రంలోనే
ఓ గొప్ప నగరంగా తిరుపతి దూసుకెళ్లు తోందనడానికి ఈ రోడ్డు గురించే ప్రధానంగా చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తిరుపతి అభివృద్ధి కేవలం ఈ ఒక్క రోడ్డు నిర్మాణానికే పరిమితం
కావడం లేదని భూమన స్పష్టం చేశారు. మున్ముందు తిరుపతి నగరం
రెండు తిరుపతిలుగా మారనున్నట్టు వెల్లడించారు. ఈ రహదారులే కాకుండా 60,80,100 అడుగుల విస్తీర్ణం మేరకు వివిధ ప్రాంతల్లో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. తద్వారా 40 వేల ఇళ్ల నిర్మాణాలకు సరిపడ్డా స్థలం కొత్తగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రస్తుత తిరుపతితో పాటు మరో కొత్త తిరుపతి నగరాన్ని కూడా నిర్మించుకునే వెసులుబాటు లభించనుందని భూమన పునరుద్ఘాటించారు. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన పంగుళూరు సీతమ్మ రోడ్డు కేవలం ముత్యాలరెడ్డి పల్లిలోని మూడు నాలుగు డివిజన్ల అవసరాలకే పరిమితమైన రోడ్డు కాదన్నారు. తిరుపతి నగరమంతటినీ అనుసంధానం చేసేలా ఇది దోహద పడనుందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో చర్చి గేట్ నుంచి వెళ్లే ఇరుకు మార్గంతో పాటు పద్మావతి అతిథి గృహం నుంచి ఎస్వీ యూ ప్రాంగణం మీదుగా అలిపిరి వరకు సరికొత్త రహదారిని కూడా నిర్మించనున్నట్టు భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలోనే మూడు రోడ్లు వస్తాయన్నారు.
స్థానిక బాలాజీ కాలనీ కూడలి వద్ద రెండు ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. టౌన్ క్లబ్ కూడలి వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గం, న్యాయస్థాన సముదాయాలకు వెళ్లే మార్గంలో మరో ఫ్రీ లెఫ్ట్ ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయం వరకు 60 అడుగుల వెడల్పుతో గంగమ్మ మార్గాన్ని నిర్మించినట్టు తెలియజేశారు. ప్రజల సహకారంతో ఈ సంవత్సరం తిరుపతి గంగమ్మ జాతరను నభూతో నభవిష్యత్ అన్నట్టు ఆరు లక్షల మంది భక్తులతో, ఏ చిన్న సమస్య కూడా తలెత్తని తీరుగా నిర్వహించడం జరిగిందన్నారు.
తాజాగా శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద గంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గం, టీటీడీ పరిపాలనా భవనాన్ని అనుకుని దక్షణ వైపు వున్న ఇరుకైన సందును,
సుందరయ్య నగర్ ను కలుపుతూ, లీలా మహల్ కూడలి వరకు విస్తరించడానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. జబ్బార్ లే అవుట్ రోడ్డును విస్తరించనున్నట్టు తెలిపారు.
కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా,
దశాబ్ధాల కాలం నుంచి ఎవరికీ సాధ్యం కాని విధంగా అభివృద్ధి చేశామన్నారు. జగనన్న సహకారం, ప్రజల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. తిరుపతి అభివృద్ధిని చూసి కంటగింపుతో చేస్తున్న విమర్శలకు తాము భయపడే పిరికి వాళ్లం కాదని, భయపడిపోయే నాయకులం కాదని హెచ్చరించారు. ప్రజల విసృత ప్రయోజనాల కోసం తలపెట్టే ఏ పనినైనా నూటికి నూరు శాతం, తాము అనుకున్నట్టే చేసితీరుతామని తేల్చిచెప్పారు. అభివృద్ధిని చేసిచూపామని, ఇంకా చేసి చూపుతామని పునరుధ్ఘాటించారు. కరోనా వ్యాప్తి సమయంలో కరోనాకు భయపడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాకపోతే, కరోనాతో మృతి చెందిన 280 మంది మృత దేహాలను తాను దగ్గరుండి ఖననం చేయించినట్టు చెప్పారు. తాము చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ ఆశీర్వదించాలని, తమ సొంత బిడ్డలుగా భావించి ఆదరించాలని భూమన కోరారు. తిరుపతి నగర మేయర్ శిరీష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగు తున్నాయని తెలిపారు. తిరుపతి అభివృద్ధికి
ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ నిరంతర కృషి చేస్తున్నారని కొనియాడారు. నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ నిత్యం ప్రజల అభ్యున్నతి కోసమే శ్రమిస్తున్నారని అన్నారు. ఇది కలా లేక నిజమా అనే విధంగా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి వల్లే తిరుపతి అభివృద్ధి సాధ్యం…భూమన అభినయ్

నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ తిరుపతిలో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లను, 7 ఫ్రీ లెఫ్ట్ లను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.‌
మాజీ ఎంపీపీ తిరుమలయ్య చొరవ కారణంగానే ఈ మార్గాన్ని త్వరగా పూర్తి చేశామంటూ తిరుమలయ్యను స్మరించుకున్నారు. ఇంకా సహకరించిన స్థానికులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తాను పాఠశాల విద్యాభ్యాసం చేసే రోజుల్లో నుంచే ఇక్కడో పెద్ద రోడ్డు వేస్తారంటూ చెబుతుంటే వినేవాడినని, కానీ ఎవరూ వేయలేదని దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే తిరుపతి అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రజల సహకారం, ప్రస్థుత కౌన్సిల్ తోడ్పాటు మరువలేనిదని చెప్పారు. తిరుపతి సహా అనేక ప్రాంతాలకు ఈ రోడ్డు అనుసంధానంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. రెండు నెలల్లో ఈ రోడ్డును నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు మాట్లాడారు.

Related Posts

You cannot copy content of this page