తిరుపతి భవానీనగర్, జబ్బార్ లే అవుట్ వద్ద జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించి పనుల వేగవంతానికి అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రహరి గోడను ఆనుకొని భవానీనగర్ గుండా రైల్వే కాలనీ వద్దకు సుమార్ 500 మీటర్ల పొడవుతో వెలుతున్న కాలువను పటిష్టంగా నూతనంగా నిర్మించిన అనంతరం దానిపై స్లాబ్ వేసి రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ రహదారి పూర్తి అయితే చుట్టు ప్రక్కల చాలా ప్రాంతాలకు సౌకర్యవంతమైన రహదారిగా ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా తిలక్ రోడ్డు వైపు నుండి జబ్బార్ లే అవుట్ వైపుగా మల్లయ్యగుంట ప్రాంతం వైపుగా సుమారు 400 మీటర్ల పొడవుతో 40 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నామని, ఈ రహదారి పూర్తి అయితే లింక్ రోడ్డుగా చుట్టు ప్రక్కల అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేస్తూ రోడ్ల నిర్మాణ పనులపై నిరంతర పర్యవేక్షణ వుండాలని, సంబంధిత కాంట్రాక్టర్లతో పనుల వేగవంతానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. కమిషనర్ వెంట తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.*