రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్ధి కేపీ వివేకానంద గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిధులుగా NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ గాయత్రి టవర్స్ వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఎమ్మెల్యే కేపీ వివేకానంద నాయకత్వాన్ని బలపరుస్తూ ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని,జరిగిన అభివృద్ధి,మరియు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ,ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,పెద్దలు,పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.