SAKSHITHA NEWS

Being with the needy – Puttedu wipes away the tears of the sorrowful (Prabhu)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని నిరుపేదలకు అండగా ఉంటూ ..
పుట్టెడు దుఃఖంతో ఉన్నవాళ్ల కన్నీళ్లను తూడుస్తా
జాతీయ కళారత్న అవార్డు గ్రహీత
అంబాల ప్రభాకర్ (ప్రభు)

ఇటీవల జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న కోటమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి బియ్యం మరియు ఆర్థిక సహాయం అందజేశారు.
సందర్భంగా ప్రభు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నుండి జమ్మికుంటకు వలస వచ్చిన వీరందరికీ ఉండడానికి ఇండ్లు నేటి వరకు లేకపోవడంతో అద్దె ఇండ్లలో ఆయా ప్రాంతాలలో గుడారాలు వేసుకొని పాత ఇనుప సామాన్లు పేపర్లు ఏరుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని భారంగా పోషిస్తూ పుట్టడు దుఃఖముతో కన్నీరు మున్నేరుగా ఏడుస్తూ తమ బాధలను చెప్పుకున్నారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ కమిషనర్ సమ్మయ్య వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి శ్రీలత సంపత్తులు చొరవ తీసుకొని వీరికి డబ్బులు బెడ్ రూమ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు,
వారి లో కొందరికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ లేకపోవడంతో దిక్కుతోచని దయనీయమైన పరిస్థితులు ఉన్నామని తెలియజేయడంతో వెంటనే స్పందించిన జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత ప్రభు జమ్మికుంట తహల్దార్ కి ఫోన్ చేయక వెంటనే స్పందించిన రాజేశ్వరి మారుతి నగర్ లో ఉంటున్న చోటుకు విచ్చేసి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి వారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ తమ పిల్లలని స్కూల్ కి పంపిస్తూ గొప్పగా చదివించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ యువజన నాయకులు అంబాల రాజ్ కుమార్,

మీ…
అంబాల ప్రభాకర్ (ప్రభు)
జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత ,
బి.ఆర్.ఎస్ నాయకులు


SAKSHITHA NEWS